← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: సరిచేసి నడిపించితివి నీ మార్గములో
📝 lyrics: Bro. Nissi Samuel Lingibheri 🙏 (LWPH Church, Srikakulam)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

✍️ Lyrics :-

Chorus:
సరిచేసి నడిపించితివి నీ మార్గములో
ఘనపరచి నను నిలిపితివి నీ సన్నిధిలో |2|
ఘనుడా యేసు ఆరాధించెదను
మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను |2| || సరిచేసి ||

1
నీవెవరో తెలియకపోయిన నిన్నెపుడు చూడకపోయిన
రూపింపక మునుపే నన్ను ఎరిగి యుంటివి |2|
పనికి రాని పాత్రను నన్ను ఎన్నుకున్నావు
నీ సేవ చేయుటకై నన్ను నిలుపుకున్నావు |2| ||ఘనుడా యేసు ||

2
బలమే క్షీణించిపోయిన బలగమే ఒంటరిని చేసిన
నీ ప్రేమ వాత్సల్యముతో బ్రతుకు బాట చూపావు |2|
ఇచ్చిన వాగ్దానము కొరకై నీరీక్షించుచున్నాను
నీ సన్నిధికి చేరుటకై అతిశయించుచున్నాను |2| ||ఘనుడా యేసు ||

3
అధికమైన నీ మేలులతో మహా గొప్ప కార్యములతో
దీవెనగ నను మలచి గొప్ప ఖ్యాతి నిచ్చావు |2|
ఊహకందనంత ఎత్తుగా నన్ను నిలిపినావు
చూడలేని కొత్త సృష్టిని నా కనులకు చూపావు |2| ||ఘనుడా యేసు ||

This page provides Telugu lyrics, sing-along track, and our Official released video of “Sarichesi nadipinchithivi nee maargamulo” Christian worship song.

🙏About the song:
✝️ సరిచేసి నడిపించితివి నీ మార్గములో — యేసయ్య ప్రేమ, కృప, మార్గదర్శకత్వాన్ని ప్రకటించే ఒక ఉల్లాసపరచు తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం 🎶🙌

మన జీవిత ప్రయాణంలో దారి తప్పినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, పనికిరాని వారమని అనిపించిన సందర్భాల్లో కూడా దేవుడు మనలను విడిచిపెట్టకుండా తన మార్గములో నడిపించి, తన సన్నిధిలో నిలబెడతాడనే అద్భుతమైన సాక్ష్య గీతం ఇది ✨

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

  • దేవుడు మన త్రోవలను సరళము చేయువాడు 🙏
  • పుట్టకమునుపే మనలను ఎరిగిన ప్రేమగల తండ్రి ✨
  • బలహీనతలో కూడా తన ప్రేమతో నిలబెట్టువాడు 💖
  • తన సేవ కొరకు మనలను ఏర్పరచుకొనువాడు 🎤
  • ఊహకందని ఆశీర్వాదములతో మనలను ఘనపరచువాడు 👑

🙏 ఈ ఆరాధన గీతం మీ హృదయాన్ని బలపరచి, యేసయ్య సన్నిధిలో మరింత దగ్గర చేయునుగాక.

🔖 Keywords / Tags:
సరిచేసినడిపించితివినీమార్గములో lyrics, sarichesinadipinchithivineemaargamulo lyrics, సరిచేసి నడిపించితివి lyrics, Telugu Christian songs lyrics, Sarichesi nadipinchithivi Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *