← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: మురిసిపోకే ఓ అందమా
📝 lyrics: Pastor G. Mark Peter Garu 🙏 (Medagadi Sahavasam, Kazipet)
🎤 Performed & Re-imagined by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

✍️ Lyrics :-

Intro:
ఎంత మురిసినా అందమా….
నిన్ను మట్టిలో పెడతారే అందమా….

Chorus:
మురిసిపోకే ఓ అందమా – నీవు మురవబోకమ్మా అందమా
ఎంత మురిసినా అందమా – నిన్ను మట్టిలో పెడతారే అందమా
ముసిముసి నవ్వులు అందమా – నీవు నవ్వమాకమ్మా అందమా
నిన్ను నమ్ముకొని అందమా – నట్టేట మునిగారే అందమా

అందమా నీవు మురిసిపోకే అందమా – నీవు మురువాబోకే అందమా
నీవు ఎగసిపడకే అందమా… |2|

1
ఉదయకాలమున అందమా – ఎంతో పచ్చంగ ఉంటావే అందమా
మధ్యాహ్నమందున అందమా – నీవు మాడిపోతావమ్మా అందమా
అద్దము ముందర అందమా – ఎంతో అందంగ ఉంటావే అందమా
అరగంటలోనే అందమా – నీవు ఆవిరైపోతావే అందమా

పాండ్సు రుద్దిన అందమా – పాసి వాసనోస్తాదమ్మా అందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||

2
ఏసీలో ఉంటే అందమా – ఎంతో సక్కంగ ఉంటావే అందమా
నీడకు ఉంటే అందమా – నిగనిగ లాడుతావందమా
బ్యూటీపార్లర్లోన అందమా – ఎంత బ్యూటీగా ఉంటావే అందమా
మ్యాచింగేసుకొని అందమా – నీవు మనసు దోచుకుంటావందమా

మరచిపోకే ఓ అందమా – నీది మూడునాళ్ళముచ్చటందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||

3
వయసు మీద పడితే అందమా – నీకు ముడతలొస్తయమ్మా అందమా
స్కిన్ లైటు పెట్టిన అందమా – నీ స్కిన్ను పాడైతదే అందమా
షుగరు వస్తే ఓ అందమా – నిన్ను సూడబుద్దే కాదు అందమా
చెమటవస్తే ఓ అందమా – నిన్ను చీదరించుకుంటారే అందమా

స్లిమ్ముగున్నానని అందమా – నీవు చిందులేయకమ్మా అందమా (2)
మరచిపోకే ఓ అందమా – నీది మూడునాళ్ళముచ్చటందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||

4
తెల్లగున్నానని అందమా – తెగ మురిసిపోతున్నావే అందమా
గ్లామరున్నాదని అందమా – నీవు గంతులేస్తున్నావు అందమా
రూపాయిలతోనే అందమా – నీ రూపాన్ని దిద్దకే అందమా
నగలేసుకోగానే అందమా – నీ నడక మారిందమ్మ అందమా

వద్దు వద్దు ఓ అందమా – ఇది వట్టి చెత్తమ్మ అందమా (2)
బైబిలు చెప్పింది అందమా – నీవు పువ్వులాంటిదానివందమా
రాలిపోతావే అందమా – నీవు వాడిపోతావమ్మా అందమా || అందమా నీవు ||

This page provides Telugu lyrics, sing-along track, and our Performance & Re-imagined video of “Murisipoke O Andamaa” Christian worship song.

✝️ మురిసిపోకే ఓ అందమా —

అందము, యవ్వనం, గర్వము, ఐశ్వర్యము అన్నీ తాత్కాలికమని గుర్తుచేసే ఆలోచింపజేసే తెలుగు క్రైస్తవ సందేశ గీతం 🎶🙏
ప్రపంచం బాహ్య సౌందర్యాన్ని గొప్పగా కొనియాడుతున్న ఈ కాలంలో, దేవుని వాక్యము మనకు నిజమైన సౌందర్యం భయభక్తులు, వినయము, పరిశుద్ధ జీవితం అని బోధించుచున్నది ✨

“అందము మోసకరము…
సౌందర్యము వ్యర్థము…”

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

🌿 మనిషి అందము గడ్డిపువ్వువలె తాత్కాలికమైనది
🙏 యవ్వనము, ఐశ్వర్యము, అలంకరణలు శాశ్వతమైనవి కావు
💖 దేవుని యందలి భయభక్తులే నిజమైన సౌందర్యము
✨ జీవితము ఆవిరివలె క్షణికమైనది
👑 బాల్యమందే సృష్టికర్తను స్మరించుట జ్ఞానము
📖 క్రీస్తును పొందుటకై లోక వైభవమంతయు వ్యర్థమే

ఈ గీతం యువతకు, కుటుంబాలకు, విశ్వాసులకు ఆత్మీయ మేల్కొలుపు కలిగించి, నిత్యమైన విలువల వైపు నడిపించునుగాక 🙌బలము కలిగించునుగాక 🙌నెమ్మదిని అనుభవించునట్లుగా చేయుగాక.

🔖 Keywords / Tags:
మురిసిపోకే ఓ అందమా lyrics, murisipoke o andamaa lyrics, ఎంత మురిసినా అందమా lyrics, Telugu Christian songs lyrics, Entha Murisinaa Andamaa Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Telugu Christian Message Song 2026, Beauty Is Temporary, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *