← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: మనగలనా యేసయ్యా – నీవు లేక క్షణమైనా
📝 lyrics: Rev. P. Chandrashekhar Garu (IPC Church, Ieeja)
🎤 Official Released by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

Will available soon !

✍️ Lyrics :-

Chorus
మనగలనా యేసయ్యా – నీవు లేక క్షణమైనా
నీ సిలువ నీడలో – చల్లగా ఉన్నాను |2|
నా హృదయ పలకా – ముద్రించబడితివే
క్రీస్తు పత్రికవై – సాగిపో సాక్షిగా |2| || మనగలనా ||

1
శిలనైన నన్ను నీవు – శిల్పముగా మలచితివే
భువిలో ఉన్న నాకు నీవు – దివిలో విందు ఇచ్చితివే |2|
నా శిల్పకారుడా – నన్ను చెక్కుకున్నావు
నీ అరచేతిలో – నిత్యము ఉండుటకు |2| || మనగలనా ||

2
పనికిరాని తీగవలె – పారవేయబడితిని
నీ పర్యవేక్షణతో – నన్ను అంటు కట్టితివే |2|
నా యజమానుడా – నీలో ఫలియించుటకు
సీయోను శిఖరమునా – స్థిరపరచినావే |2| || మనగలనా ||

3
సంఘమను సారె మీద – నన్ను దిద్దుచున్నావు
పరిచర్య ధర్మముద్వారా – సంపూర్ణునిగా చేసితివే |2|
నా మంచి కుమ్మరి – నన్ను వాడుచున్నావు
నీ గొప్ప ఇంటిలో – ఘనమైన పాత్రగా |2| || మనగలనా ||

This page provides Telugu lyrics, sing-along track, and our Official released video of “Managalanaa Yesayyaa” Christian worship song.

✝️ మనగలనా యేసయ్యా — నీవు లేక క్షణమైనా…
నీ సిలువ నీడలో చల్లగా ఉన్నాను… 🙏❤️

యేసుక్రీస్తు సన్నిధిలో జీవించుట, ఆయన సిలువ ప్రేమలో నిలిచియుండుట, ఆయన చేతిలో రూపాంతరం పొందుట, ఆయనలో ఫలించుట, ఆయన గొప్ప ఇంటిలో ఘనమైన పాత్రగా సిద్ధపడుట అనే ఆత్మీయ సత్యాలను ఎంతో హృదయాన్ని హత్తుకునే రీతిలో తెలియజేసే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం.

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

✝️ యేసయ్య లేక ఒక్క క్షణమూ మనం జీవించలేమని
❤️ ఆయన సిలువ ప్రేమ మనకు నిత్య ఆశ్రయమని
🪨 శిలనైన మనలను ఆయన శిల్పముగా మలచునని
🌿 పనికిరానివారినైనా ఆయనలో ఫలించే కొమ్మలుగా చేయునని
🏺 మంచి కుమ్మరివలె దేవుడు మన జీవితాన్ని మలచుచున్నాడని
📜 మన జీవితము క్రీస్తు పత్రికగా లోకానికి సాక్ష్యమై ఉండాలని

ఈ ఆరాధనా గీతం ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరింత దగ్గరవ్వాలని మా ప్రార్థన.

🔖 Keywords / Tags:
మనగలనా యేసయ్యా lyrics, Managalanaa Yesayya lyrics, నీవు లేక క్షణమైనా lyrics, Neevu Leka Kshanamaina lyrics, Telugu Christian song lyrics, Telugu Christian worship song lyrics, Heart Touching Telugu Christian Worship Song, Jesus Worship Song Telugu, Telugu Gospel Song Lyrics, Latest Telugu Christian Song 2026, WTP Worship Song, WayToParadise Worship, Telugu Christian devotional songs, Christian worship songs Telugu, Telugu Jesus songs lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *