👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics

📝 Lyrics & Tune: Bro. Bro. David Jampa
🎤 Performed & Officially Released by: WayToParadise

✍️ Lyrics :-

Chorus:
వాగ్దానము నీది, నెరవేర్పు నీది – వాగ్దానము నెరవేర్చగల సంపూర్ణుడవు నీవే
మాటను పలికావు, మహిమను చూపావు – ఏమైనా చేయగల సమర్దుడవు నీవే |2|
జయహో జయహో జయహో జయహో యేసయ్యా – ఓ విజయశీలుడా నీకే స్తోత్రమయా
జయహో జయహో జయహో జయహో మెస్సయ్యా – ఆదియు అంతము నీవైయున్న నీకే స్తోత్రమయా ||వాగ్దానము నీది||

1
కల్వరిలో నా కొరకై రక్తము కార్చావు – ఆ రక్తముచే నా పాపములు క్షమించియున్నావు
అపరాధములను మన్నించి బ్రతుకును ఇచ్చావు – నా క్రియలతో కాదు నీ కృపతో నను రక్షించావు |2|
నా విమోచన నీవే నా క్షమాపణ నీవే – నా ఆనందము నీవే నా సంతోషము నీవే ||జయహో జయహో ||

2
మరణముతో సమరము చేసి సమాధి గెలిచావు – పునరుత్థానము జీవమును నేనే అన్నావు
పరలోక మోక్షమును దయ చేశావు – తేజోమయునిగా నీ ఆత్మను అనుగ్రహించావు |2|
నా రక్షణయు నీవే నా నిరీక్షణ నీవే – నా విశ్వాసము నీవే నా విధేయత నీవే ||జయహో జయహో ||

✝️ Watch the Song:

🎧 Watch Lyrical Track / Karaoke Version:

🙏 About the song:
✝️ “జయహో యేసయ్యా | ఓ విజయశీలుడా నీకే స్తోత్రమయా” —
మరణమును జయించి సమాధిని గెలిచిన విజయశీలుడైన యేసుక్రీస్తును ఘనపరచే
శక్తివంతమైన నూతన తెలుగు ఈస్టర్ ఆరాధన గీతం.

“వాగ్దానము నీది, నెరవేర్పు నీది” —
దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానమును నెరవేర్చగల సంపూర్ణుడు అని ప్రకటించే విశ్వాస గీతం. 🙌

🔖 Keywords:
జయహో యేసయ్యా lyrics, ఓ విజయశీలుడా నీకే స్తోత్రమయా lyrics, వాగ్దానము నీది నెరవేర్పు నీది lyrics, Telugu Christian songs lyrics, resurrection song Telugu, Easter song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song

One comment

  1. Super song and music E song lo Pallavi 1st line 2nd charanam lo 1st line is very nice 👍👍👍👍 All glory to God only….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *