👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics

📝 Lyrics : Traditional Telugu Church Song (Lyricist Unknown)
🎤 Re-imagined & Performed by: WayToParadise

✍️ Lyrics :-

Chorus:
చిక్కుల్లో నేను పడినా యేసయ్య – ఆదుకొని ఆదరించవా
యేసయ్య అందరిలో నన్ను చేర్చవా |2|

1
గాఢాంధ-కారములో నేనున్నాను – త్రోవ తప్పి గోతిలో పడియున్నాను (2)
నీ వెలుగులో దారి చూపవా యేసయ్య – నీ మార్గములో నన్ను నడుపుమా
యేసయ్య నీ మార్గములో నన్ను నడుపుమా ||చిక్కుల్లో నేను ||

2
ఘోర పాపినైనా నన్ను క్షమియించావు – నీ ప్రేమతో నన్ను ఆదరించావు (2)
శోధనలు ఎన్ని వచ్చినా యేసయ్య – నీ కృపలో నన్ను దాయుమా
యేసయ్య నీ కృపలో నన్ను దాయుమా ||చిక్కుల్లో నేను ||

3
ద్రాక్ష వల్లి వలె నీవున్నావు – ఫలము లేని తీగవలె నేనున్నాను (2)
నీ ఆత్మతో నన్ను నింపుమా యేసయ్య – నీ బలముతో నన్ను నింపుమా
యేసయ్య నీ బలముతో నన్ను నింపుమా ||చిక్కుల్లో నేను ||

Ending:
చిక్కుల్లో నేను పడినా యేసయ్య
ఆదుకొని ఆదరించవా – యేసయ్య అందరిలో నన్ను చేర్చవా (4)


✝️ Watch the Song:

🎧 Watch Lyrical Track / Karaoke Version:

🙏 About the song:
✝️ చిక్కుల్లో నేను పడినా యేసయ్య — హృదయాన్ని తాకే ఒక ఆత్మీయమైన తెలుగు ఆరాధన గీతం.
జీవితంలోని కష్టాలలో, చీకటిలో, పాపంలో పడిన మనలను యేసయ్య ఎలా లేపి నిలబెడతాడో ఈ గీతం గాఢంగా తెలియజేస్తుంది. 🙏

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

  • చిక్కుల్లో ఉన్నప్పుడు యేసయ్య మనకు ఆశ్రయం
  • చీకటిలో ఆయన వెలుగు మనకు మార్గదర్శి
  • పాపములోనుండి క్షమించి ప్రేమతో ఆదరించువాడు
  • ఆయన కృపలోనే మనకు రక్షణ మరియు జీవము

🙏 ఈ గీతం మీ హృదయాన్ని ఆశీర్వదించి యేసయ్యలో మరింత స్థిరపడునట్లుగా చేయుగాక.

🔖 Keywords:
చిక్కుల్లోనేనుపడినాయేసయ్య lyrics, chikkullo nenu padina yesayya lyrics, Telugu Christian songs lyrics, heart touching telugu worship song, emotional prayer song telugu, wtp worship song, way to paradise Telegu Christian song

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *