← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: నా ప్రాణానికి ప్రాణం
📝 Lyrics: Bro. Prema Sekhar Garu
🎤 Performed & Re-imagined by: WayToParadise

✍️ Lyrics :-

Chorus:
నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే.. నీవే..
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే.. నీవే..

నా కొండ నీవే నా కోట నీవే (2)
నాకన్నీ నీవేలే
యేసయ్యా.. యేసయ్యా (2) || నా ప్రాణానికి ||

1
ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే ||2||

ఇమ్మానుయేలు నీవే మహిమాన్వితుడవు నీవే (2)
నాకన్నీ నీవేలే
యేసయ్యా.. యేసయ్యా (2) || నా ప్రాణానికి ||

2
కరుణతో నిండి కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే ||2||

నిరీక్షణ నీవే నా రక్షణ నీవే (2)
నాకన్నీ నీవేలే
యేసయ్యా.. యేసయ్యా (2) || నా ప్రాణానికి ||

3
కృంగిన వేళలో ఆదరణనిచ్చే స్వస్థత నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే ||2||

యెహోవా రాఫా యెహోవా యీరే (2)
నాకన్నీ నీవేలే
యేసయ్యా.. యేసయ్యా (2) || నా ప్రాణానికి ||


✝️ Watch the Song:

🎧 Watch Lyrical Track / Karaoke Version:

🙏 About the song:
✝️ “నా ప్రాణానికి ప్రాణం” – ఒక ఆత్మీయమైన తెలుగు ఆరాధన గీతం, యేసుక్రీస్తు మన ప్రాణానికి ప్రాణము, మన జీవకారకుడు, మన ఆశ్రయం, మన పరమ ప్రేమికుడు అని గుర్తుచేసే ఆత్మస్పర్శ గీతం. ఈ Re-imagined cover మన హృదయాన్ని ఆయన ప్రేమను అనుభవించేటట్లు, ఆయనపై ఆధారపడేటట్లు ప్రభువుకి మరింత దగ్గర చేస్తుంది🙏✨

🕊️ ఈ గీతం మనకు బోధించేది:
• యేసువే మన జీవమూ, శక్తీ, ప్రాణము
• ఆయన ప్రేమ అన్ని ప్రేమలకంటే మిన్న
• పరీక్షల్లో, బలహీనతల్లో మనతో ఉండే దేవుడు
• మన స్వబుద్ధిని కాదు — ప్రభువును ఆశ్రయించుటే నిజమైన బలము
• ప్రార్థనలో సాగిలపడితే యెహోవా మనకు సమాధానం ఇస్తాడు

🔖 Keywords:
నా ప్రాణానికి ప్రాణం lyrics, Naa praananiki praanam lyrics, Telugu Christian songs lyrics, Melodious Christian song Telugu, Heart touching song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *