← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది
📝 lyrics: Bro. David Jampa 🙏 (LWPH Church, Srikakulam)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

✍️ Lyrics :-

Chorus:
యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది
యేసయ్యా నీ నామమెంతో మధురమైనది |2|
బలమైనది నిత్యము నిలిచేది (2)
నా శైలమైనది నీ నామం – నా కోటయైనది నీ నామం
నా కేడెమైనది నీ నామం – నా రక్షణ శృంగము నీ నామం ||యేసయ్యా ||

1
శోధనెదురై బాధ కలిగి ఒంటరినై ఉన్నపుడు – నీ నామమే కదా నను ఆదరించెను
కష్టాలలో కన్నీళ్ళతో నే కృంగినపుడు – నీ నామమే కదా కన్నీరు తుడిచెను |2|
నను పిలిచెను – ఓదార్చెను (2)
లేవనెత్తెను నీ నామం – శక్తినిచ్చెను నీ నామం
ధైర్యపరచెను నీ నామం – ప్రేమ చూపెను నీ నామం ||యేసయ్యా ||

2
నా హీన-దీన బ్రతుకును మహిమ తేజస్సులో – నీ నామమే కదా నివసింపజేసెను
నా విన్నపము నాలకించి సమాధాన పరచెను – నీ నామమే కదా బహు-ఘననీయము |2|
నను మార్చెను నీ కృప చూపెను (2)
దివ్యమైనది నీ నామం – బహు రమ్యమైనది నీ నామం
ఘన క్రియలను చేసే నీ నామం – తరతరములు ఉండే నీ నామం

Ending:
యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది
యేసయ్యా నీ నామమెంతో మధురమైనది |2|
బలమైనది నిత్యము నిలిచేది (2)
నా శైలమైనది నీ నామం – నా కోటయైనది నీ నామం
నా కేడెమైనది నీ నామం – నా రక్షణ శృంగము నీ నామం ||యేసయ్యా ||

This page provides Telugu lyrics, sing-along track, and our Official released video of “Yesayya Nee Naamamentho Ghanamainadi” Christian worship song.

✝️ యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది —
యేసు నామ మహిమను, శక్తిని, ఆదరణను, రక్షణను ప్రకటించే హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం 🎶🙌

బాధల్లో, శోధనల్లో, కన్నీటి సమయంలో మనలను లేవనెత్తి ఓదార్చేది యేసయ్య నామమే అని ఈ గీతం శక్తివంతంగా ప్రకటిస్తుంది ✨

“నా శైలమైనది నీ నామం
నా కోటయైనది నీ నామం
నా రక్షణ శృంగము నీ నామం”

ఈ ఆరాధన గీతం మనకు గుర్తుచేయునది:

  • యేసయ్య నామము బలమైన ఆశ్రయ దుర్గము 🙏
  • శోధనలో ఆదరించే నామము 💖
  • కన్నీరు తుడిచే ప్రేమగల రక్షకుడు ✨
  • బీదలను లేవనెత్తే కృపామయుడు 👑
  • తరతరములు నిలిచే మహిమగల నామము 🔥

ఈ గీతం ప్రతి విశ్వాసికి ధైర్యము, నిరీక్షణ, ఆత్మీయ బలము కలిగించునుగాక 🙌నెమ్మదిని అనుభవించునట్లుగా చేయుగాక.

🔖 Keywords / Tags:
యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది lyrics, Yesayya Nee Naamamentho Ghanamainadi lyrics, యేసయ్యా నీ నామమెంతో మధురమైనది lyrics, Telugu Christian songs lyrics, Yesayya Nee Naamamentho Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Powerful Jesus Name Worship song, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *