← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: కన్నీళ్లు కార్చకు ఓ నేస్తమా
📝 lyrics: Sis. P. Santhosha Latha 🙏 (IPC Church, Ieeja)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

✍️ Lyrics :-

Chorus:
కన్నీళ్లు కార్చకు కలవరపడకు – దిగులు చెందకు ఓ నేస్తమా (2)
యేసే నీకు తోడుండగా – భయము చెందకు ప్రియ నేస్తమా (2) ||కన్నీళ్లు కార్చకు||

1
గుండె పగిలే వేదనతో – అలసిపోయావా
ఆదరించు దిక్కు లేక – కుమిలిపోయావా |2|
ఆశ్రయించు యేసయ్యను – నెమ్మది కలుగును తన ప్రేమలో (2) ||కన్నీళ్లు కార్చకు||

2
నా బ్రతుకే వ్యర్ధమని – విసుగు చెందావా
భారమైన శ్రమలతో – నలిగి పోయావా |2|
తేరి చూడు యేసయ్యను – దుఃఖము తీరును తన కాంతిలో (2) ||కన్నీళ్లు కార్చకు||

3
ఎవరు రారని ఒంటరి నేనని – తల్లడిల్లావా
ఆవేదనతో దిక్కు తోచక – విరిగి పోయావా |2|
ప్రార్ధించు యేసయ్యను – సేదదీర్చును తన కౌగిళిలో (2) ||కన్నీళ్లు కార్చకు||

This page provides Telugu lyrics, sing-along track, and our Official released video of “Kanneellu Kaarchaku O Nesthama” Christian worship song.

✝️ కన్నీళ్లు కార్చకు ఓ నేస్తమా — బాధలో ఉన్న ప్రతి హృదయానికి యేసయ్య ఆదరణను గుర్తుచేసే ఒక హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం 🎶🙌

జీవితంలో ఒంటరితనం, నిరాశ, వేదన, అలసట, కన్నీళ్లు…
ఎవరూ లేరని అనిపించే క్షణాల్లో కూడా యేసయ్య మనతోనే ఉన్నాడని ధైర్యమిచ్చే ఓదార్పు గీతం ఇది ✨

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

  • కన్నీళ్ల మధ్య యేసయ్య మనకు ఆదరణ 😇
  • దిగులులో ఆయన సమాధానమును అనుగ్రహించువాడు 🤍
  • ఒంటరితనంలో ఆయన ప్రేమ మనకు తోడు ✝️
  • భారమైన శ్రమలలో యేసయ్య విశ్రాంతినిచ్చువాడు 🙏
  • ప్రార్థనలో ఆయన మనసును సేదదీర్చువాడు 🌿

🙏 ఈ ఆరాధనా గీతం మీ హృదయాన్ని ఆదరించి, యేసయ్య ప్రేమలో నెమ్మదిని అనుభవించునట్లుగా చేయుగాక.

🔖 Keywords / Tags:
కన్నీళ్లు కార్చకు ఓ నేస్తమా lyrics, Kanneellu Kaarchaku O Nesthama lyrics, కన్నీళ్లు కార్చకు కలవరపడకు lyrics, Telugu Christian songs lyrics, Kanneellu Kaarchaku Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Conforting telugu christina song, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *